అశోక్‌బాబు ఎన్నికల ప్రచారం

Mar 31,2024 23:52 ##ysrcpnews #vemuru

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని పల్లెకోన, రాచూరు, ఆళ్ళమూడి గ్రామాల్లో వైసిపి అభ్యర్థి వరికూటి అశోక్ బాబు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని వైసిపి నాయకులు, కార్యకర్తలు పూలమాలతో ఆయనకు స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో వైసిపి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని కోరారు. సిఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు షేరు శ్రీనివాసరావు, పల్లికోన సర్పంచ్ బొల్లెద్దు ప్రదీప్ రాజమ్మ, ఆలముడి సర్పంచి రాంబాబు, రాచూరు సర్పంచి పాల్గొన్నారు.

➡️