ఇసుక అక్రమాలపై చర్చలు తీసుకోవాలి

Feb 24,2024 23:26

ప్రజాశక్తి – కొల్లూరు
మండలంలోని పెదలంక సమీపాన అరవింద్ వారధి దగ్గరలో అక్రమంగా ఇసుక తవ్వకాలను ఆపివేయాలని టిడిపి, జనసేన నాయకులు ఇసుక రీచ్‌లో శనివారం నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దారుకు, పోలీసులకు ఇసుక అక్రమాలను అరికట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి మండల అధ్యక్షులు మైనేని మురళీకృష్ణ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు బరితెగించి ఇసుక అక్రమ దందా చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి మేరుగ నాగార్జునను గెలిపిస్తే ఆయన అవినీతి మత్తులో సంపాదనే ధ్యేయంగా ఇసుక అక్రమ తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కనకాల మధుసూధన ప్రసాద్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబు, టిడిపి అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయ్ బాబు, జనసేన మండల అధ్యక్షులు బొందలపాటి చలమయ్య పాల్గొన్నారు.

➡️