ఇంటింటికి టిడిపి మేనిఫెస్టో

Mar 1,2024 00:15

ప్రజాశక్తి – చీరాల
టిడిపి ప్రతిపాదించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో క్యాలెండర్‌ను ప్రతి ఇంటికి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని టిడిపి ఇంచార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. పట్టణంలోని 15, 16, 17వార్డుల్లో ఇంటింటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సిఎం అయితేనే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. మెరుగై పారిశ్రామిక అభివృద్ధి చెంది రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని అన్నారు. టిడిపికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అద్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, కొండ్రు రత్నబాబు, గంజి పురుషోత్తం, విన్నకోట జగదీష్, కర్పూరపు సుబ్బలక్ష్మి, పృధ్వి రామారావు, కొట్టెం వంశీకృష్ణ, గోసాల శ్రీను, చౌడపల్లి రాంబాబు, ధోని కనకరాజు, ఎరిపిల్లి అప్పారావు, పోస హరిబాబు, దాసరి శ్రీనివాసరావు, పఠాన్ ఆయుబ్ ఖాన్, అక్కపల్లి కిరణ్ కుమార్, సిద్ధాబత్తుని రవికుమార్, మిక్కిలి వంశీ, గవిని ఏసుబాబు, బుర్ల రాముడు, కౌతరపు జనార్దనరావు, ఈడిగ మోహన్ గౌడ్, గవిని గోపి, గవిని శ్రీను, బుర్ల శ్రీరాములు, ఉసురుపాటి సురేష్, గవిని శ్రీనివాస్ యాదవ్, యర్రా శివనాగ మల్లేశ్వరి, భువనగిరి గురునారాయణ, కుంచాల రామాంజనేయులు పాల్గొన్నారు.

➡️