ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నిక

Jun 25,2024 23:30 ##Chirala #Employes

ప్రజాశక్తి – చీరాల
స్థానిక డ్రైనేజీ అతిథి గృహంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కమిటీ ఎన్నిక ప్రక్రియ మంగళవారం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రోశయ్య, శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చీరాల యూనిట్ నూతన అధ్యక్ష, కార్యదర్శులుగా వినోద్, శ్రీనివాసరావుతో పాటు 23 మంది సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, తాలూకాల్లో నూతన కమిటీలను నియమిస్తున్నామని అన్నారు. ప్రధానంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత ప్రభుత్వానికి మర్యాద పూర్వకంగా విన్నవించేందుకు అజెండా రూపొందించామని అన్నారు. ఉద్యోగులు ఎదుర్కొనే ప్రతి సమస్యకు సంఘం అండగా నిలబడుతుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని సంఘం అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో రాజేశ్వరి, చెన్నయ్య, కళ్యాణి, భాగ్యలక్ష్మి, జయరాజ్ పాల్గొన్నారు.

➡️