రైతు సంక్షేమమే సిఎం ఆశయం

Mar 2,2024 23:32

ప్రజాశక్తి – రేపల్లె
రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైతు పక్షపాతిగా సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో రూ.కోటి వ్యయంతో నూతనంగా నిర్మించనున్న పరిపాలన భవనానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. ఈపాటికే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన వ్యవసాయ అనుబంధ పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో వస్తున్న ఆధునిక మార్పులను గ్రామీణ ప్రాంత రైతులకు వివరించి అధిక దిగుబడులు సాధించేందుకు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల్లోని నిపుణులైన వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు అందిస్తున్నారని చెప్పారు. వ్యవసాయంలో మెళుకువలను చెప్పి లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులు వివరిస్తున్నట్లు తెలిపారు. సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతు బాంధవుడుగా పేరు పొందారని అన్నారు. రైతులు బాగుంటే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందనే ఆశయంతో రైతుల అవసరాలకు అనుగుణంగా ఆర్‌బికెలు, గెడ్డంగుల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మార్కెట్ యార్డులో అన్ని సౌకర్యాలతో గిడ్డంగులను పునర్నిర్మిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి, ఎఎంసి చైర్మన్ దేవగిరి సాంబయ్య పాల్గొన్నారు.

➡️