బాధితులకు ఆర్ధిక సహాయం

Nov 29,2023 23:43

ప్రజాశక్తి – చీరాల
మండలం వాడరేవు పంచాయతీ పరిధిలో పాకాల ఏరియా ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన మూడు ఇల్లు కాలిపోయాయి. బాధితులకి నష్టపరిహారం చొప్పున స్థానిక శాసన సభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి, వైసిపీ ఇంచార్జీ కరణం వెంకటేష్ తరుపున ఒక్కొక్కరికి రు.10వేల నగదు అందజేశారు. అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి గృహ నిర్మాణాలు, వలలు, నష్ట పరిహారం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ జంజనo శ్రీనివాసరావు, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, వైసిపీ చీరాల మండలం అధ్యక్షులు ఆసాది అంకాలరెడ్డి, మాజీ సర్పంచ్ ఎరిపిల్లి రమణ, మచ్చా సువార్త, అక్కల శ్రీనివాసరెడ్డి, మారుబోయిన ప్రేమ్ చంద్ రెడ్డి, చేపల గాలి, కె రాము, గవిని నారాయణ, పర్వతనేని శ్రీనివాసరావు, కావూరి యదలారెడ్డి, చప్పిడి రామచంద్రరావు, తేళ్ల రాంబాబు తదితర నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

➡️