ఉచిత దంత వైద్య శిబిరం

Feb 17,2024 00:09

ప్రజాశక్తి – వేటపాలెం
హెల్త్ కార్డుల ద్వారా ఉచిత దంత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఒ సిహెచ్ రుతమ్మ కోరారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయం ప్రాంగణంలో రవితేజ డెంటల్ కేర్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈహెచ్ఎస్, డబ్ల్యూజెహెచ్ఎస్ హెల్త్ కార్డులను వినియోగించుకొని దంతాలు సంరక్షించుకోవాలని అన్నారు. డాక్టర్‌ బి రవితేజ మాట్లాడుతూ తమ ఆస్పటల్‌లో ఉద్యోగులు, జర్నలిస్టులు, కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డెంటల్ సర్జన్ డాక్టర్లు ఎస్‌వి ప్రత్యూష, ఎస్‌సి మాన్ ఏంజెల్స్, పంచాయితీ కార్యదర్శులు ఎస్ రాజశేఖరరెడ్డి, పి శారద, కె శివలీల పాల్గొన్నారు.

➡️