గ్లుకోమ అవగాహన ర్యాలీ

Mar 17,2024 00:54

ప్రజాశక్తి – రేపల్లె
ప్రపంచ గ్లుకోమా వారోత్సవాల సందర్భంగా పట్టణంని ఫోకస్ ఐ కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీని నిర్వహించారు. హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కిషోర్ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ అఖిల జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కంటి చూపు రక్షణ, నీటి కాసులు, శుక్లాలపై అవగాహన కల్పిస్తూ ప్రచురించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ శాశ్వత అంధత్వానికి కారణమయ్యే నిశ్శబ్ద వ్యాధి గ్లాకోమా అని అన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికే ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో గుర్తిస్తే కంటి చూపు కాపాడు కోవచ్చని అన్నారు. కంటిలో వచ్చే గ్లూకోమా వ్యాధి చాలా ప్రమాదకరమైందని అన్నారు. ప్రాధమిక దశలో వ్యాధి నివారించుకునేందుకు వైద్యం పొందక పోతే శాశ్వతంగా అంధులౌతారని అన్నారు. 40ఏళ్లు పైబడిన వారు గ్లూకోమా పరీక్ష చేయించుకోవాలని సూచించారు. బిపి, షుగరు ఉన్న వాళ్ళలో ఈ వ్యాధి తొందరగా వ్యాపిస్తుందని అన్నారు. తమ హాస్పిటల్‌లో కంటికి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు అనుభవజ్ఞులైన డాక్టర్లచే చేయనున్నట్లు మేనేజర్‌ కిషోర్‌బాబు తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ నరేష్, డాక్టర్ కేశవ, వీరబాబు, మార్కెటింగ్ మేనేజర్ రాజేష్, అనిల్ కుమార్ పాల్గొన్నారు.

➡️