మంచి ప్రవర్తన అలవాటు చేసుకోవాలి

May 26,2024 00:05 ##Parchuru #Judg

ప్రజాశక్తి – పర్చూరు
అంతర్జాతీయ తప్పిపోయిన బాలబాలికల దినోత్సవ సందర్భంగా స్థానిక ఇందిరా కాలనీ ఎంపీపీ పాఠశాల్లో అవగాహన కోసం న్యాయవిజ్ఞాన సదస్సు శనివారం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి కె ప్రశాంతి మాట్లాడుతూ పిల్లలను పాఠశాలకు పంపి చదువుతోపాటు మంచి ప్రవర్తనను అలవాటు చేయాలని సూచించారు. వేసవి సెలవుల్లో పిల్లలను బయటికి వెళ్లినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఆడపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పిల్లలు తప్పిపోయినప్పుడు వెంటనే అక్కడున్న పోలీసు స్టేషన్‌కి రిపోర్ట్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పర్చూరు సర్పంచి మల్ల అంజమ్మ, మల్ల శ్రీనివాసరావు, డి రవీంద్రనాథ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

➡️