హనిమిరెడ్డి ఆర్ధిక సహాయం

Feb 24,2024 23:20

ప్రజాశక్తి – సంతమాగులూరు
మండలంలోని పుట్టావారిపాలెం అడ్డ రోడ్డు జంక్షన్లో శుక్రవారం గుండె పోటుతో మృతి చెందిన ఓర్సు హనుమంతరావు (35) కుటుంబాన్ని శనివారం వైసిపి ఇంచార్జి పానెం చిన్న హనిమిరెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు. హనుమంతరావు భార్య అంజమ్మ, పిల్లలను ఓదార్చారు. అనంతరం వారికి ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో ఎఎంసి వైస్ చైర్మన్ విప్పల ముసలారెడ్డి, వైసిపి నాయకులు గుర్రం ఏడుకొండలు, నాలి రామారావు, అద్దంకి కొండలు పాల్గొన్నారు.

➡️