ఘనంగా వెంకటరామయ్య వర్ధంతి

Jan 19,2024 00:30

ప్రజాశక్తి – వేమూరు
కొల్లూరు మండలం ఆవులవారిపాలెం గ్రామానికి చెందిన మాజీ మండల సర్వేయర్, సిపిఎం నాయకులు, మాజీ ప్రజాశక్తి విలేఖరి తిరుమల శెట్టి వెంకటరామయ్య 4వ వర్ధంతిని గాజుల్లంక గ్రామాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. సిపిఎం నాయకులు అమర్తులూరి కృపానందం, సనకా అగ్గి రామయ్య గాజులంక గ్రామంలో గల అమరవీరుల స్థూపం వద్ద వెంకట్రామయ్య చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఎం కార్యదర్శి తోడేటి సురేష్ మాట్లాడుతూ వెంకట్రామయ్య ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూనే నిరంతరం పోరాడే వారని, పదవి విరమణ అనంతరం ఎర్ర జెండా పట్టుకుని పార్టీలో కొనసాగుతూ ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి ఆనాటి శాసనసభ్యులు గుదిబండ వెంకటరెడ్డితో లంక గ్రామ రైతాగానికి లంక భూముల సాధన కమిటీ పేరుతో అనేక ఆందోళనలు చేపట్టారని పేర్కొన్నారు. అప్పటి ఆందోళన ఫలితమే నేడు లంక భూములు రైతాంగానికి దక్కాయని అన్నారు. ఆయన తుది శ్వాస విడిచే వరకు పార్టీకి కట్టుబడి పని చేయడమే కాక ప్రజాశక్తి దినపత్రిక విలేకరిగా పనిచేసి అనేకమంది మన్ననలు పొందారని కొనియాడారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు అరవ వీరభద్రుడు, సనకా కుమారస్వామి, అరవ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.

➡️