న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు

Jan 19,2024 23:46

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఎపి భూ హక్కుల చట్టం తక్షణమే రద్దు చేయాలని కోరుతూ బార్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు న్యాయవాదుల రిలే నిరాహారదీక్షలు శుక్రవారంకు 10వ రోజుకు చేరాయి. దీక్షలో న్యాయవాదులు వూస కృష్ణ, ఎం మధు, ఇమ్మడిశెట్టి యల్లమంద, డి బాలకోటేశ్వరరావు, బుర్లే అరుణ్, టీ మారుతీరావు కూర్చున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భీమా లీలాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ హక్కుల చట్టం పేద, సామాన్య ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. ప్రజలందరూ ఈ చట్టంపై అవగాహన పెంచుకొని తక్షణమే ఆ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటం చేయాలని అన్నారు. న్యాయవాదుల నినాదాలతో పాత బస్టాండ్ ప్రాంత మారుమ్రోగింది. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు డి ఫిలిప్, నాగలక్ష్మి, నాగమోహిని, బర్లపూడి నాగ ప్రసాద్, కొసన వీర శేఖర్, తోట రామాంజనేయులు, జనరల్ సెక్రటరీ ఇమ్మడిశెట్టి బాలకృష్ణ, మహిళా న్యాయవాదులు ఉషారాణి, నాగమోహిని, దివ్య, నాగలక్ష్మి పాల్గొన్నారు.

➡️