వల్లభనేని ఆశయాలు సాధిద్దాం

Apr 4,2024 00:22 #$APCPM #Vallabhaneni

ప్రజాశక్తి – వేమూరు
వైద్య వృత్తిలో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించిన కామ్రేడ్ పల్లమనేని కృష్ణమూర్తి ఆశయాలు సాధించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. వల్లభనేని కృష్ణమూర్తి సంతాప సభ బుధవారం విజయవాడలో నిర్వహించారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదాలంక గ్రామానికి చెందిన కృష్ణమూర్తి వైద్య పరంగా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతూ సిపిఎం పిలుపునిచ్చిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారని గుర్తు చేసుకున్నారు. రైతు కూలీ సమస్యలు చల్లపల్లి జమిందారు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగించిన వ్యక్తి కృష్ణమూర్తి అన్నారు. ఐద్వారాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడుతూ కృష్ణమూర్తి తుది శ్వాస వరకు సిపిఎం సభ్యునిగా కొనసాగారని అన్నారు. రావిలంక భూముల పోరాటం, భూముల పరిరక్షణ కమిటీ సభ్యునిగా అనేక సేవలు చేపట్టారని అన్నారు. కార్యక్రమంలో బాపట్ల, గుంటూరు జిల్లాల సిపిఎం నాయకులు, కార్యకర్తలు, కృష్ణమూర్తి సహ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️