జనవరి 24న మెగా రక్తదాన శిబిరం

Jan 17,2024 23:53

ప్రజాశక్తి – రేపల్లె
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి, టీడీపీ నాయకులు పరిటాల రవీంద్ర 19వ వర్ధంతి సందర్భంగా మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమని ఎంఎల్‌ఎ అనగాని సత్య ప్రసాద్ అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిటాల యువసేన, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ నెల 24న పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా మెగా రక్త దాన శిభిరంతో పాటు వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత 17ఏళ్లుగా పరిటాల యువసేన నాయకులు వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. కరోన మహమ్మారి తీవ్రంగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ప్రజలకు సేవలు అందించారని చెప్పారు. రక్త దానం చెయ్యంటం ప్రాణ దానంతో సమానమని, ప్రతి ఒక్కరు రక్త దాన శిబిరంలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో పరిటాల యువసేన అధ్యక్షులు దండ మూడి ధరణి కుమార్, నాయకులు జివి నాగేశ్వరరావు, వేమూరి అజయ్, ధర్మతేజ, రవి పాల్గొన్నారు.

➡️