గోపికృష్ణ కుటుంబానికి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ పరామర్శ

ప్రజాశక్తి – కర్లపాలెం
మండలంలోని యాజలి గ్రామానికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లగా దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ వేగేశన నరేంద్రవర్మ పరామర్శించారు. గోపీకృష్ణ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గోపీకృష్ణ మృతి ఎంతో భాద కల్గినచ్చిందని అన్నారు. ఆ కుటుంబానికి తెలుగుదేశం ఎల్లపుడు అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

➡️