విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం

Dec 3,2023 23:32

ప్రజాశక్తి – అద్దంకి
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాలకు చిల్ల చెట్లు అల్లుకొని తరుచు విద్యుత్ అంతరాయం కలుగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ అధికారులు గ్రామంలో మరమ్మతులు వచ్చిన సమయంలో చిల్లచెట్లు కనిపిస్తున్నప్పటికీ చూసి చూడనట్లు వదిలేయడం వల్లనే తమకు ఇబ్బందులు వస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ట్రాన్స్‌ఫార్మర్ ప్రాంతంలో మేకలు, గేదెలు ప్రక్కగా వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. మూగజీవులు ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర ఉన్న చిల్ల చెట్లను తినడానికి వెళ్తే ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్ ప్రాంతంలోని ఉన్న చిల్ల చెట్లను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

➡️