నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు : సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరవు

Jan 4,2024 00:02

మోకాళ్ళపై మునిసిపల్ కార్మికుల నిరసన
ప్రజాశక్తి – చీరాల
మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికుల ధర్నా శిభిరంలో ఆయన బుదవారం మాట్లాడారు. వారం రోజులకుపైగా నిరసన చేస్తుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కార్మికులు చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరింది. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఒంటి కాలుపై నిలబడి తమ నిరసన తెలిపారు. మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో బుధవారం నుండి ఏఐటీయూసీకి సంబంధించిన కార్మికులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు, ఏఐటీయూసీ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపాలని కోరారు. ప్రధాన సమస్యలు ఏవి పరిష్కరరించకుండా కాలయాపన చేస్తుందని అన్నారు. ఒకవైపు కార్మిక సంఘాలతో చర్చలు జారుపుతూనే మరోవైపు కార్మికుల సమ్మె పట్ల నిరంకుశంగా వ్యవహరిచడం దారుణం అన్నారు. కరోనా విపత్కర పరిస్థితిలో ప్రాణాలకు తెగించి వీధులను శుభ్రం చేసి కరోనాను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించిన పారిశుద్య కార్మికులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ అంటూ కీర్తించిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని ప్రశ్నించారు. అప్పట్లో అవార్డులు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడెందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. తాజాగా నిర్బంధ చర్యలకు పూనుకోవడం, పోటీ కార్మికులను తీసుకురావడం, సమ్మెను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేయడం హేయమైన చర్యని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయు అధ్యక్షులు ఎన్ బాబురావు, ఏఐటీయూసీ నాయకులు బి సాంయేల్, ఎ బాబురావు, కోటిదాసు, మున్సిపల్ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శి నూతలపాటి రాజు, అధ్యక్షులు ఎండ్లూరు సింగయ్య, డొక్కా మాల్యాద్రి, మేరమ్మ, మానికల శంకర్, బడుగు కుమారి, గూడూరు కోటేశ్వరమ్మ, వై సంధ్యా, బి విజయమ్మ, సిరీషా, తిరుపతమ్మ, యశోద, సుబ్బమ్మ, ఆంజనేయులు, రేణుమాల నసాగరాజు, గూడూరు శిరీష, పద్మ పాల్గొన్నారు. ఏఐటీయూసీ నాయకులు మాల్యాద్రి, మేరమ్మ, ప్రజాసంఘాలు నాయకులు జె కుమార్, టి విజయ్, జి ఇమ్మనియేలు మద్దతు తెలిపారు.

➡️