సంక్రాంతి సాంస్కృతిక మేళా నిర్వహణ

Jan 15,2024 00:30

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
ఆల్ ఇండియా ఘంటసాల చైతన్య వేదిక 13వ జాతీయ మహాసభలు మార్చిలో ఛత్తీస్ గడ్ రాజధాని రాయపూర్‌లో జరుగుతాయని వేదిక జాతీయ అధ్యక్షులు, జెవివి రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రారంభ కార్యక్రమాల్లో భాగంగా 15న వెదుళ్ళపల్లి చైతన్య భవన్‌లో, 16న బాపట్లలోని ఘంటసాల విగ్రహం వద్ద ఎన్‌జిఒ హోమ్ నందు సాంస్కృతిక కళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సాంస్కృతమేళాలో అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో డి నిర్మలమ్మ, ఎం మణి బాబు, బి రాజ్యం, చైతన్య కుమార్, రమేష్ పాల్గొన్నారు.

➡️