మౌళిక వసతుల కల్పనకు రోటరీ కృషి

Nov 28,2023 23:48

ప్రజాశక్తి – పర్చూరు
మండలంలోని మందగుంట, బోడవాడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతుల ఎర్పాటుకు నీళ్ళ టాంక్, కరెంట్ మోటార్, టాయిలెట్స్‌కు అవసరమైన పైప్ లైన్ ఎర్పాటు గురించి రోటరీ సభ్యులు ఆకుల వెంకటేశ్వరరావు ప్రతి పాదనతో సపోర్ట్ ఆర్థిక సహాయంతో రూ.50వేలు రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాగబైరు శ్రీనివాసరావు చేతుల మీదుగా స్కూల్ హెడ్ మాస్టర్ కెవిహెచ్ ప్రసాద్‌కు మంగళవారం అందచేశారు. కార్యక్రమంలో క్టబ్‌ కార్యదర్శి పంబి సదానందరెడ్డి, సపోర్ట్ అధ్యక్షుడు పోలిశెట్టి చంద్రశేఖరరావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, కోమటి ఆంజనేయులు, ఆకుల వెంకటేశ్వరరావు, అద్యపకురాలు జి పద్మలత, అడ్డగడ శివరామకృష్ణ పాల్గొన్నారు.

➡️