బీచ్‌లో సంపూర్ణేష్ బాబు సందడి

Feb 2,2024 22:24

ప్రజాశక్తి – చీరాల
రామాపురం బీచ్ ఫామ్ కోస్ట్ రిసార్ట్స్ వద్ద బైకుపై యువ కథానాయకుడు సంపూర్ణేష్ బాబు శుక్రవారం సందడి చేశారు. బీచ్‌కి వచ్చిన హీరో సంపూర్ణేష్‌బాబును డాక్టర్ భవాని ప్రసాద్, డాక్టర్ తాడివలస దేవరాజు రామాపురం పామ్ కోస్ట్ రిసార్ట్స్ నందు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ తాడివలస దేవరాజు మాట్లాడుతూ చీరాల పరిసర ప్రాంతాలు షూటింగ్లకు అనుకూలమైనని అన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేయవచ్చని తెలిపారు. చీరాల్లో ప్రతిభ కలిగిన యువకులు సినిమా ఇండస్ట్రీ వైపు మక్కువ కలిగి ఉన్నారని అన్నారు. చీరాల ప్రాంతంలో షూటింగులు చేసి చీరాల అభివృద్ధిలో తమ వంతు సహకారం అందించాలని కోరారు.

➡️