ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్ధులు

Mar 15,2024 00:06

ప్రజాశక్తి – వేటపాలెం
స్థానిక సెయింట్ ఆన్స్ పాలిటెక్నిక్ కళాశాల 3వ సంవత్సరం చదువుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వూల్లో ఐదుగురు విద్యార్ధులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరి వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఒంగోలులోని దామచర్లు ఆంజనేయుల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలో చెన్నైకి చెందిన గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ కంపెనీ క్యాంపస్ ఇంటర్వూలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ ఎం వేణుగోపాలరావు తెలిపారు. ఈ ఇంటర్వూల్లో మొత్తం 31 మంది ఉద్యోగాలకు ఎంపిక కాగా వారిలో 5 గురు తమ కళాశాల విద్యార్థులు ఉన్నట్లు డిప్లమా డెప్యూటి డైరక్టర్ (పాలిటెక్నిక్) కె విజయభాస్కరరెడ్డి తెలిపారు. ఇసిఇ నుండి కె స్వాతి, ఎస్‌ వసంత, ఎన్‌ గోవర్దిని, ఇఇఇ నుండి ఎం లోహిత, వై మౌనిక ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులకు ఏడాదికి రూ.3.00లక్షల వేతనం, ఉచిత వసతి, భోజన, భీమా ఇతర సౌకర్యాలు కల్పిస్తారని ప్రాంగణ ఎంపికల అధికారి ఎన్‌ పూర్ణచంద్రరావు తెలిపారు.

➡️