న్యాయ వాదుల దీక్షకు మద్దత్తు

Jan 13,2024 01:02

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
పట్టణంలో గత 3రోజుల నుంచి నిరసన దీక్ష చేస్తున్న న్యాయ వాదులకు వివిధ ప్రజాసంఘాలు మద్దత్తు తెలిపాయి. భూమి హక్కుల చట్టాన్ని సవరించి నూతన చట్టం తయారు చేసిన చట్టం వలన పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని న్యాయవాదులు చెబుతున్నారు. కొత్త చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 3రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సీపీఎం నాయకులు గంగయ్య మాట్లాడుతూ పేదలకు అన్యాయం చేసేలా ప్రభుత్వం కొత్త చట్టాలు తేవడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులతోపాటు సిపిఎం, సిపిఐ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

➡️