టిడిపి సభకు తరలి వెళ్లాలి

Feb 17,2024 00:14

ప్రజాశక్తి – కొల్లూరు
ఈనెల 17న బాపట్ల పార్లమెంట్ పరిధి కదిలిరా చంద్రబాబు సభ పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో జరుగుతుందని, సభకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని మాజీ మంత్రి నక్క ఆనందబాబు కోరారు. స్థానిక ఎంప్లాయిస్ రిక్రియేషన్ క్లబ్‌లో టిడిపి సర్వసభ్య సమావేశం మైనేని మురళీకృష్ణ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సభలో ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం వచ్చేసిందని అన్నారు. 54రోజుల్లో ఎన్నికల్లు జరగనున్నాయని అన్నారు. ఐదేళ్లుగా ప్రజలు అనుభవించిన బాధలకి అంతం పలకాల్సిన సమయం వచ్చిందని అన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేసిన జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కిన ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. వైసిపి పాలనలో యువతకు భవిష్యత్తు లేకుండా పోయిందని అన్నారు. మండలంలోని దోనేపూడి గ్రామానికి చెందిన 30 మంది వైసీపీ కార్యకర్తలు ఆనందబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. కార్యక్రమంలో టిడిపి పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ గొరిగిపూడి ప్రసాద్, బుజ్జి పాల్గొన్నారు.


భట్టిప్రోలు : ఇంకొల్లులో జరిగే కదలిరా సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని మాజీమంత్రి నక్కా ఆనందబాబు కోరారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం టిడిపి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి వాకా శేషుబాబు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. అరాచక పాలనను అంతం చేసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు కదలిరా సభను జయప్రదం చేయాలని కోరారు. టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారానికి వస్తుందని అన్నారు. సంక్షేమం, అభివృద్ది చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. వైసిపి పాలనలో దళిత గిరిజనులపై అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. అరాచకాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు టిడిపిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా, పట్టణ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు, రైతు నాయకులు వేములపల్లి జగన్నాధరావు, బట్టు మల్లికార్జునరావు, కనపర్తి సుందర్రావు, మాజీ ఎంపీటీసీ ఎడ్ల జయశీలరావు, వై కరుణ శ్రీనివాసరావు, జొన్నాదుల వెంకటేశ్వరరావు, మోటూరు పుణ్య శ్రీనివాసరావు, జంగం సాంసన్ పాల్గొన్నారు.

➡️