గోడపత్రికలు ఆవిష్కరణ

Mar 8,2024 23:38

ప్రజాశక్తి – సంతమాగులూరు
మండలంలోని పుట్టావారిపాలెం గ్రామంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో కలలకు రెక్కలు కరపత్రం, గోడపత్రికలను మహిళా విభాగం నేతలు శుక్రవారం ఆవిష్కరించారు. మహిళా సాధికారిత దిశగా టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక ముందడుగు వేసి కలలకు రెక్కలు అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారని అన్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు చదువుకు సంబంధించి డబ్బు కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ తెలుగు మహిళా విభాగం కార్య నిర్వాహక కార్యదర్శి నాగబోతు సుజాత, కొనికి గోవిందమ్మ, గుండపునేని విజయలక్ష్మి, సయ్యద్ గౌసియా పాల్గొన్నారు.

➡️