మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Jan 4,2024 00:03

ప్రజాశక్తి – బాపట్ల
పురపాలక సంఘం ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మున్సిపాలిటీ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు బుధవారం సమ్మెకు దిగారు. సానుకూలంగా పరిష్కరించే వరకు విధులకు హాజరయ్యేది లేదని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు సిఐటియు నాయకులు శరత్ సంఘీబావం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యలపై చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మె బాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో విద్యుత్తు, ఇతర విధులు నిర్వర్తించే కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు అదనంగా అందించే రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హరిబాబు, రేణుక, సాంబిరెడ్డి పాల్గొన్నారు.

➡️