ప్రమాదానికి గురై ఇద్దరికి తీవ్ర గాయాలు

Mar 10,2024 23:51

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని రేణింగవరం సమీపంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనపై రేణింగవరం ఎస్‌ఐ మాట్లాడుతూ ఇద్దరు యువకులు ఎవరో తెలియాల్సి ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన తీరు తెలియాల్సి ఉందని అన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️