తూనికలు కొలతలపై అవగాహన

Dec 29,2023 00:03

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
విద్యార్థులు తూనికలు కొలతలపై అవగాహన పెంచుకోవాలని తూనికలు కొలతలు ఇన్స్‌పెక్టర్ రామదాసు అన్నారు. స్థానిక దరువాది కొత్తపాలెం మునిసిపల్ అప్పర్ ప్రైమరీ పాఠశాల్లో విద్యార్థులకు తూనికలు కొలతల పరికరాల రకాలు, వాటి అవసరం, ఎలా వినియోగిస్తారనే అంశాలు వివరించారు. గ్రాము, కిలో గ్రాము, లీటరు, మీటరు అనే వ్యత్యాసాలు, ఏవేవి దేనికి ఉపయోగిస్తారో పిల్లలకు చెప్పారు. పాత రోజుల్లో వాడే కొలత పద్ధతులు, వాటి నమూనాలను ప్రదర్శించారు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరికరాలు వినియోగం జరుగుతుందని తెలిపారు.

➡️