ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి

Apr 7,2024 00:43 ##apsec #apelection

ప్రజాశక్తి – చీరాల
ఓటు హక్కును ప్రజలు అందరూ స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఒకటో పట్టణ ఎస్‌ఐలు వేమన, వెనకటేశ్వర్లు అన్నారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు మేరకు డిఎస్‌పి బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో తనిఖీలు చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పట్టణ సిఐ శేషగిరిరావు ఆధ్వర్యంలో సిబ్బంది, బిఎస్ఎఫ్ బాలగాలతో శనివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా చీరాల పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రూట్ మార్చ్ నిర్వహించారు. పేరాల ప్రాంతంలో వాహనాలు తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది అందరూ ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీల్లో పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు పాటించకుండా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రజలందరూ నిబంధనలు పాటించాలని గుర్తు చేశారు. వివాదాస్పదమైన సమాచారం పోలీసులుకు తెలపాలని కోరారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరం పట్టణం లోనికి ప్రవేశిస్తున్న వివిధ వాహనాలను తనిఖీలు చేశారు.

➡️