మహిళలు అభివృద్ది చెందాలి

Mar 10,2024 23:57

ప్రజాశక్తి – చీరాల
మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సిఐటియు జిల్లా నాయకులు పి కొండయ్య అన్నారు. దేశాయిపేట సిలోన్ కాలనీలో మహిళా దినోత్సవం అల్లిరాణి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పక్షోత్సవాలు జరుగుతున్నట్లు తెలిపారు. స్త్రీలు అన్ని రంగాల్లో పురోభివృద్ది సాధించాలని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. లింగ వివక్షతకు వ్యతిరేకంగా మహిళలు పోరాడుతున్నారని అన్నారు. అందులో భాగంగానే హక్కులు సాధించుకున్నారని అన్నారు. అదే స్ఫూర్తితోనే సువర్ణమాల కాలనీ సమస్యలపై పోరాడారని అన్నారు. ఆమె స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. కాలనీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మహిళలు అందరూ ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. సమావేశంలో కాలనీ నాయకులు శివనాడియన్, సత్తివేలు, కర్ణ, పుష్పరాణి, సెల్వి, ఝాన్సీ రాణి పాల్గొన్నారు.

➡️