దివ్యాంగులు, వద్ధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు

May 22,2024 15:24 #East Godavari

ప్రజాశక్తి-గోపాలపురం: దివ్యాంగులకు, వృద్ధులకు ఎవరూ లేని అభాగ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించి వారికి సంతృప్తిగా భోజనాలు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని కానిస్టేబుల్‌ రాపాక బాల కుమారి అన్నారు. బుధవారం గోపాలపురం పోలీస్‌ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాపాక బాలా కుమారి , ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ రాజు దంపతుల పెద్ద కుమారుడు శ్రీగ్విత్‌ 6వ పుట్టినరోజు వేడుకలు గొల్లగూడెం దివ్యాంగుల, వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యంగులకు, వృద్ధులకు సుమారు వందమందికి అన్నదానం చేశారు. అనంతరం వారి సమక్షంలో కేక్‌ కటింగ్‌ చేసి వారికి స్వీట్స్‌ అందజేశారు. పుట్టినరోజు జరుపుకున్న కుటుంబ సభ్యులను ఆశ్రమం అధినేత కాగితాల భాస్కరరావు, శుభాకాంక్షలు తెలిపి, వారి సేవలు మరువలేనివి అభినందించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

➡️