హక్కులను కాలరాస్తున్న బిజెపి

May 2,2024 21:32

ప్రజాశక్తి – కురుపాం : ఆదివాసుల హక్కులను కాలరాస్తూ చట్టసభల్లో నల్ల చట్టాలు తీసుకు వచ్చిన బిజెపిని, దానికి మద్దతిచ్చిన పార్టీలను తరిమి కొట్టాలని సిపిఎం రాష్ట్రదర్శి వర్గ సభ్యులు కె. సుబ్బారావమ్మ పిలుపునిచ్చారు. ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థి మండంగి రమణతో కలిసి గురువారం కురుపాం సంత లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రావాడ కూడలిలో సంతకు వచ్చిన గిరిజన ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆదివాసుల హక్కు అయిన జీవో నెంబర్‌ 3ను ప్రభుత్వం రద్దు చేసిందని, అడవుల్లో ఆదివాసులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులను అడవులనుంచి వెళ్లగొట్టి అదానీ అంబానీలకు అప్పగించేందుకు బిజెపి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. అంబేద్కర్‌ రచించిన టువంటి రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తామంటూ ప్రమాద ఘంటికలు జారీ చేస్తున్న ఇటువంటి పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థులైన మండంగి రమణను, పాచిపెంట అప్పలనర్సను గెలిపించాలని కోరారు. అనంతరం బియ్యాల వలస, గుజ్జుపాడు, సంగెడ్డ, సింగుపురం గిరిజన గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి గంగునాయుడు , ఉలక వాసు, అంగధ, ఎం. అడ్డమేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. పాచిపెంట మండలంలోని పోస్టువలస, కందిరివలస, గుంటమామిడివలస, చీపురు వలస, అమ్మ వలస, పి.కోనవలస, గరేలవలస, మాతుమూరు, కొండ తాడూరు, గురువు నాయుడుపేట, నందమెట్ట, పాంచాలి గ్రామాల్లో ప్రచారం చేయడం జరిగింది పలు గ్రామాల్లో సిపిఎం నాయకులు కోరాడ ఈశ్వరరారు, సూకూరు అప్పలస్వామి ఆధ్వర్యాన ప్రచారం చేపట్టారు. రైతు సంఘం నాయకులు బోను గౌడ్‌ నాయుడు మద్దతు తెలిపారు.

➡️