మాజీ సర్పంచ్‌ ఇంట్లో దారుణహత్య

Apr 28,2024 12:40 #Brutal murder, #former sarpanch, #house

పెదబయలు (అల్లూరి) : మండల కేంద్రమైన సీతాగుంట పంచాయతీ పెదబయలు గ్రామంలో మాజీ సర్పంచ్‌ తైసాబు త్రినాద్‌ ఇంట్లో హత్య జరిగింది.
పూర్తి వివరాల్లోకెళితే … మాజీ సర్పంచ్‌ తైసాబు త్రినాధ్‌ ఇంట్లో వారం రోజులుగా సోదరుని వివాహం సందడి నెలకొని ఉంది. శనివారం మధ్యాహ్నం శోభా హేమరాజు కుటుంబసభ్యులతోను, అతడి భార్య కానిస్టేబుల్‌ తోను వంతాడపల్లి గ్రామం నుంచి పెదబయలులో జరిగే వివాహం కోసం బంధువు ఇంటికొచ్చారు. పెళ్లి జరిగే ఇంట్లో డి జె సౌండ్స్‌ తో కోలాహలంగా ఉంది. రాత్రి 12 గంటల నుండి ఒంటి గంట సమయంలో ఇంటి మేడమీద హేమరాజు నిద్రిస్తున్న సమయంలో ముందస్తు పథకం వేసుకున్న సీతాగుంట పంచాయతీ ముసిడి పుట్టు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ త్రినాధ్‌ స్వంత బంధువు పల్లుల సుందర్‌ రావు (అప్పారావు) (35) వ్యవసాయ కత్తిని తీసుకుపోయి హేమరాజు మెడ, భుజం పై గట్టిగా నరికి వేయడంతో కేకలు వినిపించాయి. నిద్రిస్తున్న కొంతమంది ఆ ఘటన చూసి కేకలు వేయడంతో బంధుమిత్రులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు నిందితుడుగా ఆరోపణ ఎదుర్కొంటున్న సుందర్రావు మొహానికి ముసుగు వేసుకొని పరరాయ్యాడని స్థానికులు అంటున్నారు. మరోవైపు … శోభా హేమరాజు భార్యతో సుందర్‌ రావు (అప్పారావు)కు అక్రమ సంబంధం అనుమానం ఉన్నట్లు తెలుస్తుంది. రెండేళ్లుగా పెద్దలు కుటుంబసభ్యులకు తెలియపరచి న్యాయం చేయాలని కోరినప్పటికి పెద్దలు చర్యలు తీసుకోక పోవడంతో రెండేళ్లుగా భార్యభర్తలు విడి విడిగా కాపుముంటున్నారని, మాజీ సర్పంచ్‌ తైసాబు త్రినాద్‌ సోదరుని వివాహానికి వస్తారని తెలిసి ముందస్తు పథకం ప్రకారం మొహానికి ముసుగు వేసుకొని వచ్చి హత్యచేసాడని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. హేమరాజును శనివారం రాత్రి బంధువుల సహకారంతో 108 ద్వారా పాడేరు జిల్లా హాస్పిటల్‌ కు తరలించగా, అప్పటికే అతడు మఅతిచెందాడని హాస్పిటల్‌ నుంచి వారి స్వంత గ్రామామైన వంతాడపల్లిలో సమాచారం అందించారు. ఆదివారం ఉదయం జి.మాడుగుల సిఐ రమేష్‌ కుమార్‌ స్థానిక ఎస్‌ఐ పులిమనోజ్‌ కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️