సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : అల్లూరిలో ప్రచారం

Apr 27,2024 11:19 #alluri, #campaign, #CPM Candidates

ఎటపాక-చింతూరు (అల్లూరి) : సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు పై ఓటు వేసి ప్రజా సమస్య ల పై నిరంతరం పోరాడుతున్న సిపిఎం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని ఎటపాక మండలం గోళ్ళగట్ట గ్రామంలో ఉపాధి హామి కూలీలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఐవి, ప్రసన్న, ఇరపా సత్యం, బండారు స్టాలిన్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. మరోవైపు … ఈరోజు ఉదయం చింతూరు మండలం సిరసనపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం గురించి వెంకట్‌, మల్లేష్‌ నేతలు వివరించారు.

➡️