ఎంఆర్‌పి రేట్లపై నిఘాజిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ నోడల్‌ అధికారి చంద్రనాయక్‌

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాల ఎంఆర్‌పి రేట్ల పై కూడా నిఘా ఉంచినట్లు అన్నమయ్య జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం నోడల్‌ అధికారి చంద్రనాయక్‌ పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మంగళ వారం రాజంపేట అసెంబ్లీ పరిధి లోని పుల్లం పేట, ఆరవపల్లి, నల్లతిమ్మయ్యపల్లి గ్రామం లోని వివిధ ప్రభుత్వ మద్యం దుకాణాలను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం రాజంపేటలో ఉన్న ఒక రెస్టారెంట్‌, బార్‌ను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఇద్దరు వ్యక్తుల ను షాపుల వద్దకు ముందుగా పంపి రేట్ల ప్రకారం ఖచ్చి తంగా మద్యం విక్రఇస్తున్నారా, లేదా అని పరిశీలించినట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చే మద్యం నియంత్రణ కోసం జిల్లా లోని చెక్‌ పోస్టులతో పాటు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఎప్పటి కప్పుడు జిల్లా ఎన్నికల అధికారి దష్టికి తీసుకు వస్తు న్నట్లు తెలిపారు. సంభందిత రిజిస్టర్‌ల ద్వా రా నిల్వగల స్టాక్‌ను నిశి తంగా పరిశీలిం చామని చెప్పారు. తనిఖీల్లో ఆయన వెంట డిటి జయసింహ, ఎక్సైజ్‌ సబ్‌ – ఇన్స్‌ పెక్టర్‌ రామకష్ణశాస్త్రి, ఎస్‌ఐ గాయత్రీ, జిఎస్‌టి ఓ అధికారి హేమంత్‌ కుమార్‌తో పాటు టీంసభ్యులు సుధాకర్‌, విజరు పాల్గొన్నారు.

➡️