నగదు, మద్యం అక్రమ రవాణాను నిరోధించేలా తనిఖీలు

May 10,2024 17:10

సమీక్షలో మాట్లాడుతున్న నీనానిగం
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఎన్నికల విధులు అప్రమత్తత నిర్వహించాలని స్టాటిస్టిక్‌ సర్వే లైన్స్‌ బృందాలు, మద్యం, నగదు అక్రమ రవాణా నిరోధించే విధంగా తనిఖీలు చేపట్టాలని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారి నీనానిగం అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో ఎన్నికల వ్యయంపై సంబంధిత అధికారులతో గురువారం ఆమె సమీక్షించారు. చెక్‌ పోస్టుల వద్ద తనిఖీలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లలోనూ తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్‌, డ్రైవర్లు కూడా ప్రయాణికుల, సీట్లను, బ్యాగులను పరిశీలించాలన్నారు. బ్యాంకు యూపిఐలపై దృష్టి పెట్టాలన్నారు. అంతర్‌ జిల్లా చెక్‌పోస్టుల వద్ద ట్రాన్సిట్‌ పర్మిట్లను పరిశీలించి వాటి ఎక్స్‌పైరీ డేట్‌ను గుర్తింంచాలని చెప్పారు. ఫ్రీ బీస్‌ విషయంలో టోకెన్ల పంపిణీని నిరోధించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (ఎస్‌ఇబి) అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని కోరారు. మద్యం షాపుల్లో రోజువారి స్టాకును పరిశీలించాలని, అక్రమ నిల్వ, తరలింపులకు వీల్లేకుండా చూడాలని చెప్పారు. సమీక్షలో ఎన్నికల వ్యయ పరిశీలకులు సుమిత్‌ కుమార్‌, జార్జ్‌ జోసఫ్‌, గౌతమ్‌ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత ఆమె కలెక్టరేట్‌లోని మీడియా సెంటర్‌ను పరిశీలించారు.

➡️