అదనపు బడ్జెట్‌ కేటాయించండిరాష్ట్ర సీఎస్‌కు ద్రవిడ విశ్వవిద్యాలయ విసి

అదనపు బడ్జెట్‌ కేటాయించండిరాష్ట్ర సీఎస్‌కు ద్రవిడ విశ్వవిద్యాలయ విసి

అదనపు బడ్జెట్‌ కేటాయించండిరాష్ట్ర సీఎస్‌కు ద్రవిడ విశ్వవిద్యాలయ విసి వినతిప్రజాశక్తి -గుడిపల్లి ద్రవిడ విశ్వవిద్యాలయానికి అదనపు బడ్జెట్‌ కేటాయించాలని ద్రవిడ విశ్వవిద్యాలయ విసి ఆచార్య మధుజ్యోతి రాష్ట్ర సీఎస్‌ జవర్‌హర్‌రెడ్డిని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సిఎస్‌ జవహర్‌ రెడ్డిని ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కొలకలూరి మధుజ్యోతి బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ద్రవిడ విశ్వవిద్యాలయంలో నెలకొన్న సమస్యలను ఆయనకు వివరించారు. విశ్వవిద్యాలయానికి అదనపు బడ్జెట్‌ను కేటాయించాలని కోరారు. వర్సిటీలో ఔట్సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యల గురించి ప్రత్యేకంగా ఆయనకు వివరించారు. చిత్తూరు జిల్లాలోని ఏకైక విశ్వవిద్యాలయమైన ద్రవిడ విశ్వవిద్యాలయానికి జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను అనుబంధం చేయాలని వినతి చేశారు. మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడ విశ్వవిద్యాలయ అభివద్ధికి అన్ని విధాలుగా సహకరించాలని సిఎస్‌ను కోరారు. ఈ మేరకు వారికి వీసీ ఆచార్య కే మధు జ్యోతి వినతి పత్రం అందించారు. వీటిపై రాష్ట్ర సీఎస్‌ జవహర్‌ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

➡️