ఆడుదాం ఆంధ్ర.. నూతన క్రీడాచరిత్ర

Dec 26,2023 21:42

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వినూత్నంగా ఆడుదాం ఆంధ్ర క్రీడాపోటీలను రాష్ట్రస్థాయిలో ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర విద్యుత్‌, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మెసానికల్‌ గ్రౌండ్‌లో ఆడుదాం.. ఆంధ్ర క్రీడల ప్రారంభోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లాలో క్రీడాసంబరాలను మంత్రి పెద్దిరెడ్డి, జడ్పీ చైర్మన్‌ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌, చిత్తూరు ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్‌ అముద క్రీడాజ్యోతి వెలిగించి ప్రారంభించారు. నగర మేయర్‌ అముద, ఎస్పీ రిషాంత్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు, రాష్ట్ర ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ విజయానంద రెడ్డి, రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సురేష్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ ధనుంజయ రెడ్డి, చుడా చైర్మన్‌ పురుషోత్తం రెడ్డి, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్‌, రాజేష్‌ కుమార్‌ రెడ్డి, పాల్గొన్నారు. క్రీడాపోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలన, జాతీయ జెండా, ఆడుదాం ఆంధ్ర జెండాను ఆవిష్కరణతో కార్యక్రమం జరిగింది. జిల్లా తరపున ఆడుదాం ఆంధ్ర అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న కబడ్డీ పోటీలలో జాతీయ స్థాయిలో రాణించిన సదుం మండలంకు చెందిన డి.గుల్జార్‌, ఖోఖో లో జాతీయస్థాయిలో రాణించిన చిత్తూరు జిల్లా చెందిన ఎ.రాజ్‌ కుమార్‌, పవర్‌ లిఫ్టింగ్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన గుర్రంకొండ మండలంకు చెందిన కె.శ్రీలక్ష్మిలను, మంత్రి, కలెక్టర్‌ అభినందించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ యువత, విద్యార్థులు ఉత్సాహంగా క్రీడాసంబరాల్లో పాల్గొన్నాలని కోరారు. రాష్ట్రంలోని యువత క్రీడలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు జిల్లాలో 612 సచివాలయ పరిధిలో ఈకార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. దాదాపు నెల రోజులు నిర్వహించనున్న ఆడుదాం ఆంధ్రలో వివిధ క్రీడలకు సంబంధించి టీములను ఏర్పాటు చేయడం, ఆట మైదానాలను సిద్ధం చేయడం జరిగిందన్నారు. మేయర్‌ మాట్లాడుతూ యువత ఉత్సాహంగా పాల్గొనాలని, రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో రాణించాలని తెలిపారు. జడ్పీ సీఈవో ప్రభాకర్‌ రెడ్డి, కమిషనర్‌ అరుణ, జిల్లాస్పోర్ట్స్‌ ఆఫీసర్‌ బాలాజీ, హౌసింగ్‌ డిఆర్‌డిఏ, డ్వామా పీడీలు పద్మనాభం, తులసి, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.పాత్రికేయులకు క్రికెట్‌ కిట్‌: ఆడుదాం.. ఆంధ్ర.. క్రీడాపోటీల్లో భాగంగా చిత్తూరు ప్రెస్‌క్లబ్‌ సభ్యులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కిక్రెట్‌ కిటును అందజేశారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు లోకనాధం, అశోక్‌కుమార్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు.

➡️