ఆదరించండి.. గెలిపించండి: ఎంపీ

Mar 25,2024 21:53
ఆదరించండి.. గెలిపించండి: ఎంపీ

ప్రజాశక్తి – బంగారుపాళ్యం: వైసీపీని మరో సారి ఆదరించి గెలిపించాలని ఎంపీ రెడ్డెప్ప కోరారు. మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీలో మండల కన్వీనర్‌ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఐదాళ్లు పూర్తి పారదర్శకంగా సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చామన్నారు. మరింత అభివృద్ధి జరగాలంటే మరోసారి వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పాల ఏకిరి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కుమార్‌రాజా, ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్‌కుమార్‌, వైస్‌ ఎంపీపీ శిరీష్‌రెడ్డి, నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, చలపతి, మురళి తదితరులు పాల్గొన్నారు.

➡️