చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం : మాజీ ఎమ్మెల్సీ

Dec 25,2023 23:03
చంద్రబాబు పర్యటన విజయవంతం చేద్దాం : మాజీ ఎమ్మెల్సీ

ప్రజాశక్తి-రామకుప్పం: టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటనను సమిష్ట కృషితో విజయవంతం చేద్దామని మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక టీడీపీ కార్యాల యంలో ఆయన పార్టీ నేతలతో సమావేశమై మాట్లాడారు. 28, 29, 30 తేదీల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు కుప్పంలో పర్యటిస్తారని తెలిపారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షులు మునస్వామి, మండల అధ్యక్షుడు ఆనందరెడ్డి, కార్యదర్శి నరసింహులు, నేతలు రామ్మూర్తి, కష్ణానాయక్‌, జయశంకర్‌, విజరుకుమార్‌ రెడ్డి, మహమ్మద్‌ రఫీ, వెంకటాచలం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️