జగన్‌ వచ్చాక ‘పట్టు’ తప్పింది.!

Jan 17,2024 22:19
జగన్‌ వచ్చాక 'పట్టు' తప్పింది.!

శ్రీ పలమనేరులో పట్టు రైతులు, రీలర్ల సమ్మెశ్రీ పెండింగ్‌ ఇన్సెంటివ్‌ చెల్లించాలని డిమాండ్‌ప్రజాశక్తి-పలమనేరు: పట్టు రైతులు, రీలర్లకు పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్‌ చెల్లించాలని రైతు సంఘం నాయకులు గురుమూర్తిశెట్టి డిమాండ్‌ చేశా రు. బుధవారం పలమనేరు పట్టణంలో గల సిల్క్‌ ఫార్‌ వద్ద పట్టు రైతులు, రీలర్లు ఇన్సెంటివ్‌ కోసం నిరవేదిక సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా పట్టు రైతులు మాట్లాడుతూ ఎంతో కష్టపడి మల్బరి సాగు చేస్తున్నమని, సక్రమమైన గిట్టు పాటు ధర లేక నష్టపోతున్నామన్నారు. గత ప్రభుత్వాలు గుర్తించి ఒక్క కేజీ పట్టుగూళ్ళకు 50 రూపాయలు చొప్పున ఇన్సెంటివ్‌ ప్రకటించారని, అప్పట్లో ఇన్సెంటివ్‌ అందుతున్నప్పటికీ, జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఒక్క పైసా కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కలు నాటడానికి ప్రోత్సాహక నగదు, పరికరాలకు, పట్టుపురుగులకు వాడే మందులపై, యంత్రాలు తదితర పరికరాలపై రాయితీలు ఇచ్చే వారిని ప్రస్తుతం అవి ఏ మాత్రం పట్టు రైతులకు అందలేదని, ఈ విషయాన్ని నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయి, నాయకులకు, అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న కనికరము లేక పట్టు రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ గతంలో పట్టు రైతులకు ఇస్తున్న, పెండింగ్‌ ఇన్సెంటివ్‌ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో శంకర్‌ రెడ్డి, చంద్రప్ప గౌడు, రిజ్వాన్‌, అమానుల్లా, ఆనంద రెడ్డి, మునిరత్నం రెడ్డి, కరుణాకర్‌ శెట్టి, గోవిందు, మౌలా పట్టు రైతులు, రీలర్లు పాల్గొన్నారు.

➡️