జనవరి 5న తుది ఓటర్ల జాబితా

Dec 14,2023 00:13
జనవరి 5న తుది ఓటర్ల జాబితా

అన్ని ఫార్మాట్లకు దరఖాస్తుల స్వీకరణ
జిల్లా రెవెన్యూ అధికారి
ప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్‌: జిల్లాలో ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, తీసివేతలకు సంబంధించి దరఖాస్తులు అందాయని, వాటికి సంభందించి ఈ నెల 26 వరకు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి జనవరి 5న పారదర్శక తుది ఓటర్ల జాబితా విడుదల చేయడం జరుగుతుందని జిల్లా రెవిన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ అన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిఆర్‌ఓ సమావేశం నిర్వహించారు. డిఅర్‌ఓ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఎపిక్‌ కార్డులు పోస్టల్‌ కార్యాలయం నుంచి నేరుగా ఓటర్ల అడ్రస్‌కు వెళ్లడం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తీసివేతలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో అత్యంత పారదర్శకంగా పరిశీలించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బిఎస్పి ప్రతినిధి భాస్కర్‌, బిజెపి ప్రతినిధి అట్లూరి శ్రీనివాసులు, కాంగ్రెస్‌ ప్రతినిధి పరదేశి, వైసిపి ప్రతినిధి ఉదరు కుమార్‌, టిడిపి ప్రతినిధి సురేంద్రకుమార్‌లు పాల్గొన్నారు.

➡️