జర్నలిస్టుపై దాడి సిగ్గుచేటు

Feb 19,2024 21:57
జర్నలిస్టుపై దాడి సిగ్గుచేటు

కలెక్టరేట్‌ ఎదుట జర్నలిస్టుల ధర్నా రాజకీయ పార్టీనేతల మద్దతుప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ ఆదివారం అనంతపురం జిల్లా రాపాడులో నిర్వహించిన సిద్ధం సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షిగా ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు కృష్ణపై జరిగిన దాడిని నిరశిస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట చిత్తూరు ప్రెస్‌క్లబ్‌ నేతృత్వంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం డాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఆర్‌ఒ పుల్లయ్యకు వినతిపత్రం అందజేశారు. గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ పార్టీల నేతలు ప్రతికాస్వేచ్ఛను కాపాడలంటూ ధర్నా నిర్వహించారరు. కలెక్టరేట్‌ ఎదుట తెలుగుదేశం పార్టీ నేతలు జర్నలిస్టులకు మద్దతుగా ధర్నా చేశారు. పత్రికాస్వేచ్ఛను కాపాడాలని, ఫోటో జర్నలిస్టులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని రాజకీయ పార్టీల నేతలు, జర్నలిస్టు సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. జర్నలిస్టుల సంఘం నాయకులు అశోక్‌ కుమార్‌, మహేష్‌బాబు, ఫింట్‌మీడియా, ఎలక్ట్రానింగ్‌ మీడియా ప్రతినిధులు బాలసుబ్రమణ్యం, రమేష్‌, నవిన్‌, కరీమ్‌, సురేంద్రరెడ్డి, రాజేష్‌ పాల్గొన్నారు. జర్నలిస్టుల పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, సిపిఐ నాయకులు గోపినాథ్‌, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షులు పోటుగారి భాస్కర్‌, తెలుగుదేశం నాయకులు దొరబాబు, చంద్రప్రకాష్‌, మాజీమేయర్‌ కఠారి హేమలత, సురేంద్రకుమార్‌ సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుపై దాడి సిగ్గుచేటుసిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సభ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై జరిగిన దాడి సిగ్గుచేటని, దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సోమవారం చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్‌ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సభకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఫోటోగ్రాఫర్‌పై విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టడం అన్యాయం అన్నారు. దాడి చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని, ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా కఠినచర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవారు ఎలాంటి వారైనా ప్రజాకోర్టులో నిలబడాల్సిందేనని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడి పత్రికాస్వేచ్ఛకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఫ్యాన్‌ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం మాజీ మంత్రి అమరనాథరెడ్డి పలమనేరు: వచ్చే ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచేయడానికి జనం కసితో సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసిపి ఆధ్వర్యంలో జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై జరిగిన దాడిపై ఆయన స్పందించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ కవరేజీకి వచ్చిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌పై వైసిపి నేతలు చేసిన దాడి దారుణమని, ఇది జర్నలిజంపై జరిగిన దాడి మాత్రమే కాదని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించారు. జగన్‌ తన బూటకపు ప్రసంగాలతో జనాన్ని బురిడీ కొట్టించాలని చూస్తున్నారన్నారు. ఎవరిది అభివద్ధి పాలనో.. ఎవరిది విధ్వంస పాలనో ప్రజలకు తెలుసున్నారు. జగన్‌ నోటి నుంచి వచ్చేవి అన్నీ అసత్యాలు, బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలే అన్నారు.గంగాధరనెల్లూరు: రాప్తాడులో సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ శ్రీకష్ణపై దాడిని ఖండిస్తూ గంగాధరనెల్లూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతూ గంగాధర నెల్లూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కామసాని గోవర్ధన్‌రెడ్డి మద్దతు పలికారు. విలేకరులు కల్వకుంట రమేష్‌, రవి, రోహిత్‌ కుమార్‌, విజరు, వెంకటేష్‌, దేవరాజులు, సుధాకర్‌, జయచంద్ర నాయుడు, సుబ్రమణ్యం రెడ్డి, చంద్రబాబు నాయుడు, నీరజాక్షులు, తిరుమల, ఎంజీఆర్‌, జయ ప్రకాష్‌, సతీష్‌ పాల్గొన్నారు.కార్వేటినగరం, వెదురుకుప్పం : ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ జర్నలిస్ట్‌ కష్ణపై రాప్తాడులో జరిగిన దాడి పట్ల జర్నలిస్టు ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రం కార్వేటినగరంలోని గాండ్ల మిట్ట కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఎఎస్సై మునికష్ణ వినతిపత్రం అందజేశారు. ఎపియుడబ్ల్యూజె నాయకులు గోవిందస్వామి మాట్లాడుతూ పాలకులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు జర్నలిస్టులపై దాడులను ప్రోత్సహించడం మంచి పరిణామం కాదని అన్నారు. పుంగనూరు: వైయస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభలపేరుతో మీడియాపై దాడులు చేయించడం దురదష్టకర సంఘటనని సీనియర్‌ జర్నలిస్ట్‌ తూపల్లి జనార్థన్‌ అన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ కష్ణ పై జరిగిన భౌతిక దాడి తీవ్రంగా ఖండిస్తూ పుంగనూరు జర్నలిస్టులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మూలస్తంభమైన మీడియాపై దాడి చేయడం నీచమైనచర్యగా అభివర్ణించారు. సిద్ధమంటే మీడియాపై దాడి దౌర్జన్యం భయానిక పరీక్షలు కల్పించడానికి సిద్ధమా అన్నారు. గోకుల్‌ సర్కిల్‌ నుండి ర్యాలీగా అంబేద్కర్‌ సర్కిల్‌ చేరుకుని విగ్రహానికి పులమాల వేసి నిరసన తెలిపి, తహశీల్దార్‌ కార్యాలయంలో డీటీకి వినతిపత్రం అందజేశారు. సీనియర్‌ జర్నలిస్టులు మురళి, ఉదరుకుమార్‌, గిరిశేఖర్‌, వాలేశ్వర్‌ రెడ్డి, ఏల్కూరు మురళి, అప్పి రెడ్డి పాల్గొన్నారు.నగరి: పట్టణ పరిధిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సోమవారం రాప్తాడు సిద్దం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ పై దాడికి నిరసనగా విలేకరులు నిరసన తెలిపారు. అక్కడి నుంచి విలేకరులు ర్యాలీగా నగరి ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఏఓకు వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టులు శ్రీనివాసులు నాయుడు, మనీ, వీటీ భాస్కర్‌, విజరు, మోహన్‌, లోకేష్‌, అభి, తులసీరామ్‌ పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులపై దాడి అన్యాయమని నగరి తెలుగుదేశం పార్టీ సీనియర్‌ కార్యకర్తలు రామానుజం చలపతి అన్నారు. రాప్తాడు సీఎం సిద్దం సభలో విధి నిర్వహణలో వున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ కష్ణపై దాడిని ఖండిస్తూ సోమవారం నగరి మునిసిపాలిటీ ఒకటో వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్‌ లత, తెలుగు మహిళలు నల్ల దుస్తులు, ముఖానికి నల్ల ముసుగులు, కళ్ళకు నల్ల గంతలు ధరించి నిరసన తెలిపారు. పలమనేరు: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ పై జరిగిన దాడి సిగ్గుచేటని దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సోమవారం చిత్తూరు జిల్లా పలమనేరు ఆర్‌డిఓకు పలమనేరు మీడియా సభ్యులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. పెద్దపంజాణి: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్‌ పై జరిగిన దాడి సిగ్గుచేటని దాడి చేసిన వారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పెద్దపంజాణి ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు రెడ్డిప్రసాద్‌ అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌కు ఈ ఘటనకు బాధ్యులైన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ప్రెస్‌క్లబ్‌ ఉపాధ్యక్షులు ప్రకాష్‌ కుమార్‌, గౌరవ అధ్యక్షులు నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలసుబ్రమణ్యం, మాధవ, ధనంజయ, శ్రీనివాసులు, అఫ్జల్‌ పాల్గొన్నారు.

➡️