జోనల్స్‌లో ఓవరాల్‌ ఛాంపియన్‌గా నాగరాజకుప్పం జడ్పీహెచ్‌ఎస్‌

Dec 26,2023 21:45

ప్రజాశక్తి- నగరి: జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నాగరాజు కుప్పంలో జరిగిన జోనల్‌ క్రీడల్లో స్పోర్ట్స్‌, గేమ్స్‌లో నాగరాజు కుప్పం జడ్పీహెచ్‌ఎస్‌ ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ సాధించింది. అథ్లెటిక్స్‌ విభాగంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కొత్త ఆరూరు ఛాంపియన్షిప్‌ కైవసం చేసుకుంది. ఛాంపియన్‌ సాధించిన క్రీడాకారులను ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు కప్పులను ఇచ్చి సత్కరించారు. కార్యక్రమంలో ఎంఈవోలు శ్రీదేవి, నమశ్శివాయం, జోనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చెన్నకేశవులు, సీనియర్‌ పీడీలు సురేష్‌, మణి, రాజేశ్వరి, సుబ్రహ్మణ్యం, గురప్ప్ర, జ్ఞాన కుమార్‌, వేలు పాల్గొన్నారు.

➡️