జ్యుడీషియల్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

Dec 17,2023 23:18
జ్యుడీషియల్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

జిల్లా అధ్యక్షులు గోపీనాధరెడ్డి
ప్రజాశక్తి చిత్తూరుఅర్బన్‌: చిత్తూరు నగరంలోని పాత కోర్టు ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా జూలీషియల్‌ ఎంప్లాయిస్‌ కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష గోపీనాధరెడ్డి, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీపతి మాట్లాడుతూ జూన్‌ నెలలో కొత్త కార్యవర్గం ఏర్పడిందన్నారు. జ్యుడీషియల్‌ పరిధిలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా జడ్జ్‌, రాష్ట్ర యూనియన్‌ దష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ఈ సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా పలుచోట్ల కోర్టులో వర్క్‌ లోడ్‌ ఎక్కువగా ఉందని, పెండింగ్‌ కేసులు పరిష్కరించేందుకు తగిన సిబ్బంది లేకపోవడంతో వాటిని వర్తి చేయాలని కోరారు. కొత్తగా విధుల్లోకి చేరిన ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జ్యుడీషియల్‌ ఉద్యోగులకు సంబంధించి మరిన్ని సమస్యల పైన కార్యవర్గ సమావేశంలో సభ్యుల అమూల్యమైన సలహాలు సూచనలు తీసుకొని వాటిని రిసల్యూషన్‌ ద్వారా పాస్‌ చేసి నివేదిక రూపంలో జిల్లా జడ్జికి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలలోని జ్యుడిషియల్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

➡️