దశాబ్దాల కల..లో వోల్టేజీ గోల

Feb 13,2024 22:06
దశాబ్దాల కల..లో వోల్టేజీ గోల

శ్రీ రెండు మండలాలకు తీరనున్న కరెంటు కష్టాలుశ్రీ ప్రారంభానికి సిద్ధమవుతున్న 132/33 కెవి సబ్‌ స్టేషన్‌శ్రీ ఎమ్మెల్యే పట్టుదలపై కర్షకుల ప్రశంసలుప్రజాశక్తి- వీకోట: మండల పరిధిలో లోవోల్టేజీ పరిష్కారానికి నాటి పాలకులు రైతుల్ని మభ్యపెట్టారు… కర్షకుల కష్టాల్ని కల్లారా చూసిన స్థానిక శాసనసభ్యులు ఆరుగాలం కష్టించే రైతన్నకు దన్నుగా నిలబడ్డారు… పట్టుబట్టి పెద్ద సబ్‌స్టేషన్‌ను మంజూరు చేయించారు… పనులు శరవేగంగా సాగుతున్నాయి… మరో రెండు నెలల్లో అన్నదాతల కంట ఆనందాన్ని చూసే గడియలు సమీపిస్తున్నాయి… నాణ్యమైన విద్యుత్తో సిరులు పండించే తరుణం ముంచుకొస్తోందని రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. లో వోల్టేజ్‌ శాశ్వత పరిష్కారానికి బాటలు వేసిన శాసనసభ్యుడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రాష్ట్రాల కూడలి అయిన వికోట మండలంలో సుమారు 20వేల ఎకరాల సాగుభూమి ఉంది. వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. టమోటా, బీన్స్‌, క్యాబేజ్‌, బంగాళదుంప, మిరప, బంతి, చామంతి, దోస, సోర, కాకర, అరటి, స్వీట్‌ కార్న్‌ తదితర పంటలు విస్తారంగా సాగుచేస్తారు. అధిక మొత్తంలో బోరు బావులపై ఆధారపడి పంటలు పండిస్తారు.. వీటికి తోడు పలు ఫ్లోర్‌ మిల్లులు, లేత్‌లు, వెల్డింగ్‌ షాపులతో పాటు పట్టణంలో విద్యుత్‌ వినియోగం అధికమైంది. ప్రధానంగా కొన్నేళ్లుగా విద్యుత్‌ సమస్య రైతులను పట్టిపీడిస్తోంది. ఈసమస్యతో బోరు మోటార్లు, స్టార్టర్లు పాడైపోతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. పెట్టుబడులు కోల్పోవాల్సి దుస్థితి నెలకొంది. నాణ్యమైన విద్యుత్‌ పంపిణీ చేయాలని రైతులు ఏళ్ల తరబడి మొత్తుకున్న పాలకులలో వోల్టేజ్‌ సమస్య పరిష్కారాణికి 132 సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టలేదు. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే వి.కోట మండలానికి చెందిన శాసనసభ్యులు వెంకటేగౌడ రైతులకు నాణ్యమైన విద్యుత్‌ పంపిణీ చేయాలని సంకల్పించారు. 132/33 కెవి సబ్‌స్టేషన్‌ నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లారు. విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యంలో సబ్‌స్టేషన్‌ కొరకు పలుమార్లు పోరాడారు. ఎట్టకేలకు మంజూరు చేయించుకున్నారు. ట్రాన్స్కో అధికారులు విద్యుత్‌స్టేషన్‌ నిర్మాణం కొరకు భూములు వెతుకులాట మొదలు పెట్టారు. భూములు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రాలేదు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి అనువైన భూములు కనపడలేదు. దీంతో ఎమ్మెల్యే తన సొంత గ్రామంలో రైతులతో చర్చించారు. రెండు మండలాల రైతులందరికీ సబ్‌స్టేషన్‌ ప్రయోజనం గురించి వివరించారు. ఐదుగురు రైతులు 10ఎకరాల సాగు భూమిని సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దగ్గరుండి రైతులకి సంతప్తికర పరిహారం అందించి భూసేకరణ ప్రక్రియ త్వరిత గతిన పూర్తి చేయించారు. సబ్‌స్టేషన్‌ పనులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. రెండు నెలలుగా సబ్‌స్టేషన్‌ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. టవర్ల నిర్మాణం, విద్యుత్‌ నియంత్రికల అమర్చడానికి బేస్మెంట్‌ తదితర పనులు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. మార్చి ఆఖరి కల్లా సబ్‌స్టేషన్‌ అందుబాటులో రానున్నట్లు ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు. కర్షకులకు మేలుచేయాలన్న శాసనసభ్యుడి పట్టుదలపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సబ్‌స్టేషన్‌ అందుబాటులోకి వస్తే వి.కోట, బైరెడ్డిపల్లి మండలాల రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందుతుంది. వి.కోట మండలంలో 3650 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. బైరెడ్డిపల్లి మండల పరిధిలో 6100 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిఏటా కొత్తగా 200 నుంచి 500 విద్యుత్‌ కనెక్షన్లు కొరకు రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ లెక్కన ప్రతిఏటా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్య పెరుగుతోంది. అధిక మొత్తంలో విద్యుత్‌ వినియోగిస్తారు. లో వోల్టేజ్‌ కారణంగా విద్యుత్‌ కోతలు భారీగా పెరుగుతున్నాయి. విద్యుత్‌ కోసం రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. నాణ్యతలేని విద్యుత్‌ సరఫరాతో విద్యుత్‌ నియంత్రికలు కాలిపోతున్నాయి. వేసవి ఆరంభం నుండి విద్యుత్‌ కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. బోరు బావుల వద్ద కాపు కాస్తున్నారు. పంటలను రక్షించుకోలేక సతమతమవుతున్నారు. సబ్‌స్టేషన్‌ ఏర్పాటుతో లో వోల్టేజ్‌ సమస్య నుంచి బయటపడతామని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించే కర్షకుల కష్టానికి ఫలితం దక్కి రైతులు ఆర్థికంగా బలపడి రైతేరాజు అన్న స్వప్నం నెరవేరుతుందని రెండు మండలాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.తీరనున్న కరెంట్‌ కష్టాలు- చిన్నప్ప, ఏడి, పలమనేరు డివిజన్‌నియోజకవర్గంలోనే వెనుకబడిన ప్రాంతాలైన వికోట, బైరెడ్డిపల్లి మండలాల్లో నెలకొన్న లో వోల్టేజ్‌ సమస్యను అధిగమిచ్చేందుకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో వికోట మండలంలో వేగంగా సాగుతున్న132/ 33, కేవి సబ్‌స్టేషన్‌ త్వరలో ప్రారంభం కానున్నడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. లోవోల్టేజ్‌ సమస్యను అధిగమించి నాణ్యమైన విద్యుత్తును రైతులకు, ప్రజలకు అందించేందుకు ఈ సబ్‌ స్టేషన్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

➡️