నిబంధనల మేరకు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు : జేసి

Feb 14,2024 21:29
నిబంధనల మేరకు పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు : జేసి

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల సిబ్బంది తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుందని జాయింట్‌ కలెక్టర్‌ పి.శ్రీనివాసులు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని జాయింట్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో జేసి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జనవరి 22న ఫైనల్‌ ఎలక్టోరల్‌ రోల్‌ పబ్లిష్‌ చేయడం జరిగిందని, ఓటర్ల జాబితాలో సవరణలు మార్పులు చేర్పులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలన నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన మేరకు అధికారుల నియామకాలు దాదాపుగా పూర్తి అయ్యాయన్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయని, దీనికి అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ ప్రతినిధి భాస్కర్‌, పరదేశి, సిపిఎం ప్రతినిధి గంగరాజు, బీఎస్పీ పార్టీ ప్రతినిధి భాస్కర్‌, వైయస్సార్సీపి ప్రతినిధి ఉదరు కుమార్‌, టిడిపి ప్రతినిధి ప్రభు తేజ, ఎలెక్షన్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌ బాబు పాల్గొన్నారు.

➡️