పర్మినెంట్‌ చేసే వరకు సమ్మె విరమించేది లేదునగర పాలక సంస్థ ఎదుటు పారిశుధ్య కార్మికుల ధర్నా

పర్మినెంట్‌ చేసే వరకు సమ్మె విరమించేది లేదునగర పాలక సంస్థ ఎదుటు పారిశుధ్య కార్మికుల ధర్నా

పర్మినెంట్‌ చేసే వరకు సమ్మె విరమించేది లేదునగర పాలక సంస్థ ఎదుటు పారిశుధ్య కార్మికుల ధర్నా ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులు, తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా సమ్మె కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా చిత్తూరు నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను సమస్యలను పరిష్కరించాలని సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి గౌరవ సలహాదారు కే.మణి, నగర కార్యదర్శి దాసరి చంద్ర, నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.రమాదేవి మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు, మంత్రికి తెలియజేసినప్పటికీ సమస్యను పరిష్కరించకపోగా సమ్మెను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప సమస్యను సానుకూలంగా పరిష్కరించడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో వాసు, జయశంకర్‌, సురేష్‌, వినాయక, ఈశ్వర్‌, సుగుణ, సుబ్రహ్మణ్యం, సుకన్య, శోభన్‌ బాబు, రమణి, వినోద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️