ప్రభుత్వ భూముల్లో రాజకీయ రాబంధలు పేదల పైనే రెవెన్యూ ప్రతాపం

Feb 8,2024 22:04
ప్రభుత్వ భూముల్లో రాజకీయ రాబంధలు పేదల పైనే రెవెన్యూ ప్రతాపం

ప్రజాశక్తి – తిరుపతి కాయకష్టం చేసుకుని బతుకుతున్న నిరుపేదలు రెండు సెంట్లు ఇంటి స్థలం అడిగితే భూములే లేవంటూ రెవెన్యూ అధికారులు బుకాయిస్తున్నారు. అయితే ఒక్క కరకంబాడి ప్రాంతంలోనే వేలాది ఎకరాల ప్రభుత్వ భూముల వివరాలను ప్రజా సంఘాల నేతలు వెలుగులోకి తీసుకురావడంతో అధికారులే విస్తుపోతున్నారు. ఆ భూములు ఎవరికిచ్చారో లెక్క తేల్చాలని పట్టుబడుతుండటంతో అధికార యంత్రాంగం నోరు మెదపలేక కనుగుడ్లు తేలేస్తున్నారు. ఎందుకంటే ఆ భూముల్లో ఇప్పటికే రాజకీయ రాబందులు పెద్ద ఎత్తున పాగా వేసేశారు.ఒక్క కరకంబాడిలోనే వేల ఎకరాలు!రేణిగుంట మండల పరిధిలోని ఒక్క కనకంబాడి రెవెన్యూ పరిధిలోనే వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు ప్రజా సంఘాల నేతలు సర్వే నెంబర్లతో సహా వెలుగులోకి తెచ్చారు. ఈ భూములను ఎవరికి కట్టబెట్టారో లెక్క చెప్పాలంటూ కలెక్టర్‌ లక్ష్మీ షాను నిలదీశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ భూములపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తానటూ హామీ ఇవ్వడం గమనార్హం.జానెడు గుడిసెకు స్థలం ఇవ్వలేరాజున్ను, భవన నిర్మాణ కార్మికురాలు నేను 18 సంవత్సరాలుగా భవన నిర్మాణ కార్మికురాలుగా పనిచేస్తున్నాను. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు మావి. కాయ కష్టం చేస్తే వచ్చే నాలుగు డబ్బులు మాకు తినడానికే సరిపోవడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారే కానీ మా గుడిసెకు మాత్రం జానెడు స్థలం ఇవ్వలేదు. అందుకే ఎర్రజెండా నీడన గుడిసె వేసుకున్నాం. అయితే తొలగించేందుకు అధికారులు కుట్రలు చేయడం దారుణం.పేదలు సరే …పెద్దోళ్ల సంగతి ఏంటి? : మోదీన్‌ప్రభుత్వ కొండ స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలని ఇబ్బందులు పాలు చేస్తున్నారు సరే… మరి వేలాది ఎకరాలను తమ కబంధహస్తాల్లో ఉంచుకున్న పెద్దోళ్ల సంగతి ఏంటో నిగ్గు తేల్చాలి. వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు దర్జాగా కబ్జా చేస్తున్నా నోరు మెదపని ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్లు పేదల పైన కర్రపెత్తనం చేస్తుంటే ఊరుకోబోము. మాకు అండగా ఎర్రజెండా ఉంది. తాడో పేడో తేల్చుకుంటాం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.వెలుగులోకి వచ్చిన ప్రభుత్వ భూములివే..సర్వేనేం ఎకరాలు1 – 7529.41-అడవి153/1 – 125.65-అడవి74 – 3485.16340/1 – 2.15666/2 – 2.72714 -123.7 అనాదీన భూములు ఏమయ్యాయో Aూజుణజ…705/1 -198.00 ప్రభుత్వ భూమి ఎవరికి కట్టబెట్టారో తెలియదుపశువుల బైలు కోసం100 -1.13 సెంట్లు234 – 8.98241/2 -1.93 సెంట్లు621/9 -3.42 సెంట్లు622/1 – 9.58 సెంట్లు73/2 – 3.47 సెంట్లుఈ భూముల పరిస్థితి ఏంటని నిలదీస్తే రెవెన్యూ నుంచి సమాధానమే లేదు.నివాస గృహాలకు140/1 -11.22 సెంట్లు140/2 – 2.93 సెంట్లు746/1 -9.96 సెంట్లు కేటాయించినప్పటికీ ఈ భూములను ఎవరికిచ్చారు అని ప్రశ్నిస్తే కళ్లుతేలేస్తున్నారు.

➡️