మాటిచ్చారు.. నెరవేర్చరే.!

Jan 17,2024 22:17
మాటిచ్చారు.. నెరవేర్చరే.!

శ్రీ 37వ రోజూ అంగన్వాడీల సమ్మెప్రజాశక్తి-పలమనేరు: ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.. న్యాయపరమైన డిమాండ్‌లు నెరవేర్చమంటే బెదిరిస్తారా.. అంటూ ప్రభుత్వంపై అంగన్వాడీలు ధ్వజమెత్తారు. తమ వేతనాలు, వివిద డిమాండ్‌లు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారంతో 37వ రోజుకు చేరుకుంది. బుధవారం పలమనేరులో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై నినాదాలతో హోరెత్తించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గిరిధర గుప్తా, ఓబుల్‌ రాజు కార్యదర్శి సిఐటియు భారతి, ఐఎఫ్టియు ఇర్షాద్‌, రాధ ఏఐటీయూసీ శాంతి, గోవిందమ్మ, అనసూయ, ధనమ్మ , గోవిందమ్మ, లత, అబీదా తదితరులు పాల్గొన్నారు. నోటీసులకు సమాధానంప్రజాశక్తి-బైరెడ్డిపల్లి: సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీలకు ఐసీడీఎస్‌ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. అందుకు ప్రతి స్పందనగా అంగన్వాడీలు బుధవారం బైరెడ్డిపల్లి మండలం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు సీడీపీవో లతకు వివరణ ఇచ్చారు.నోటీసులకు సమాధానం ఇస్తే బెదిరింపులా..?శ్రీ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న వాడ గంగరాజుప్రజాశక్తి-చిత్తూరు అర్బన్‌: అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారానికి 37వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా బెదిరింపులకు పాల్పడి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చిందని అంగన్వాడీ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు అన్నారు. నోటీసులకు పది రోజులు లోపు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా అంతలోపే అంగన్వాడీలు సమాధానం ఇస్తుంటే చిత్తూరు జిల్లాలో ఐసిడిఎస్‌ అధికారులు సమాధానాన్ని తిరస్కరిస్తూ సమ్మె విరమిస్తున్నట్లు రాసిస్తేనే తీసుకుంటామని బెదిరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లాలో ఐసిడిఎస్‌ అధికారుల తీరు బాధాకరమని ప్రభుత్వ అధికారిగా ఉంటూ ఎవరు ఏది ఇచ్చినా తీసుకోవాలి, షోకాస్‌ నోటీస్కు సమాధానం ఇస్తుంటే తీసుకోకుండా బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఏదైనా ఇవ్వదలు చుకుంటే పిడికి ఇచ్చుకోండంటూ నిర్లక్ష్య ంగా సమాధనం చెబుతున్నట్లు మండిపడ్డారు. నోటీస్‌ ఇచ్చిన సీడీపీవోకి సమాధానం ఇవ్వాల్సి ఉండగా జిల్లా అధికారికి ఎందుకు ఇస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిడిపిఓలు చట్ట విరుద్ధంగా వ్యవహరించడంపై జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్వాడీలకు ఏదైనా నష్టం జరిగితే సీడీపీవోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

➡️