రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు

Mar 20,2024 22:08
రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు

శ్రీ పచ్చికాపల్లంలో నూతన బ్యాంకు ఏర్పాటుశ్రీ ప్రారంభించిన బ్యాంకు అధికారులుప్రజాశక్తి-వెదురుకుప్పం: రైతుల ఆర్థికాభివృద్ధికి బ్యాంకు తోడ్పాటు అందిస్తుందని సప్తగిరి గ్రామీణ బ్యాంకు జనరల్‌ మేనేజరు ప్రభాకరన్‌ పేర్కొన్నారు. మండలంలోని పచ్చికాపల్లంలో నూతన బ్యాంకును ఏర్పాటు చేశారు. బ్యాంకు రీజనల్‌ అసిస్టెంట్‌ మేనేజరు జయకుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్‌ మేనేజర్‌ ప్రభాకరన్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రైతులకు, వ్యాపారస్తులకు, ఖాతాదారులకు ఉత్తమమైన సేవలను అందిం చడమే సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌ ఆశయం అన్నా రు. ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత గ్రామ ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్య క్రమం భాస్కర్‌ రెడ్డి, రైతులు, సంఘమిత్ర సుబ్రహ్మణ్యం, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️